Friday, January 29, 2010

విద్యోద్యాన వనమాలి

స్నేహమే వేదికకాగా
స్నేహితులే పందిరి వెయ్యగ
విజ్ఞానమే తోరణ మవ్వగ
జ్ఞాపకాల రాగం మ్రోగ
 
చదువుల పల్లకిలో విద్యాయోధులు వూరేగిరాగా
చదువులతల్లె అక్షింతలు చల్లగ
నారద తుంబురులే వేదాలల్లగ
విద్యోద్యాన వనమాలికి అభినందన నీరాజనం     

No comments:

Post a Comment