ప్రేమ ఎంత మధురం
ఈనాడే నా తోలిజననంతొలకరిలా తొలి ప్రణయం
నడిరేయిలోన రవికిరణం
పూల తావిలో తేనెబొట్టులా ప్రేమ ఎంత మధురం..
౧)
కలకాదంది నిజమేనంది
తనునాకోసం ఇలవాలింది
తేలవారేలా నడిరేయుంది
తన తలపుల్లో నను ముంచింది
నా మనసే భాషనేర్చి భాష్యం చెబుతోంది (ప్రేమ ఎంత మధురం)
౨)
అరె ఏమైంది మది నిండింది
ఇరు కన్నుల్లో తను నిలిచింది
నడిసంద్రంలో అలఎదురైంది
చలిగాలుల్లో చిరు చెమటైంది
నా తనువుకు రెక్కలొచ్చి చుక్కలకెగిరింది