Friday, April 9, 2010

ప్రేమ ఎంత మధురం

ప్రేమ ఎంత మధురం
ఈనాడే నా తోలిజననం
తొలకరిలా తొలి ప్రణయం
నడిరేయిలోన రవికిరణం
పూల తావిలో తేనెబొట్టులా ప్రేమ ఎంత మధురం..

౧)
కలకాదంది నిజమేనంది
తనునాకోసం ఇలవాలింది
తేలవారేలా నడిరేయుంది
తన తలపుల్లో నను ముంచింది
నా మనసే భాషనేర్చి భాష్యం చెబుతోంది (ప్రేమ ఎంత మధురం)

౨)
అరె ఏమైంది మది నిండింది
ఇరు కన్నుల్లో తను నిలిచింది
నడిసంద్రంలో అలఎదురైంది
చలిగాలుల్లో చిరు చెమటైంది
నా తనువుకు రెక్కలొచ్చి చుక్కలకెగిరింది    

1 comment: