Thursday, August 5, 2010

మేఘం మంటికి మనసిచ్చింది

మేఘం మంటికి మనసిచ్చింది
దూరం వాటిని విడదీసింది
తెమ్మెర మేఘపు తలనిమిరింది
మేఘం కంటికి తడి తగిలింది
గుండెని చీల్చుకు వరదయ్యింది

చినుకుతో మట్టిని ముద్దాడింది
నేల వానస్నానమాడింది
నిర్జలమేఘం నింగికి ఎగిరింది
తెలుపు రంగునలముకుని తేలిపోయింది
ఐనా...... మేఘం మట్టిని మనువాడింది
పుడమి కడుపు పండి పసిమిని మిసిమింది

No comments:

Post a Comment