skip to main
|
skip to sidebar
Sahithi
Monday, September 27, 2010
మనసు మాగాణి
ఓ సందెసూరీడు అరుణసువర్ణమై మెరవగ
పుడమిపై రవికాంతి పుత్తడిపూలై విరిసింది
గతపు గాయాలపై వెండివెన్నల ఔషధి అవ్వగ
మనసు మాగాణిపై ఆశలఒరి మొలిచింది
ఓ ఉదయమేఘం మంచుపూలు కురవగ
ఏటిగట్టున నామనసు చల్లగాలై వీచింది
గడ్డిపూలపై నాఊహ తూనీగై ఆడగ
ఓ చిరుకవిత కాగితపు పూవై విరిసింది
Thursday, September 2, 2010
నే మైత్రీవనమాలిని
స్నేహపు కోరల కాటిన్యానికి నే అచేతన సాక్షిని
సమీపుల వెలివేతకు నే ఒంటరి సాక్షిని
సన్నిహితుల అపహాస్యపు వేటుకు నే నిశబ్ద సాక్షిని
స్నేహపు ఎండమావిలో ఓదార్పును వెదికిన అంధ సాక్షిని
నే ఆశను వీడని ఓడిన బంటుని
నే శ్వాసను వీడిన స్నేహపు ఊపిరిని
నే స్నేహాకాశంలో కన్నీటి ఆవిరిని
నే కరకు స్నేహ కుసుమాలపై పన్నీటి జల్లుని
నే మైత్రీవనమాలిని
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
Followers
Blog Archive
►
2012
(1)
►
July
(1)
►
2011
(7)
►
October
(2)
►
April
(1)
►
March
(3)
►
February
(1)
▼
2010
(12)
►
December
(1)
►
November
(1)
▼
September
(2)
మనసు మాగాణి
నే మైత్రీవనమాలిని
►
August
(2)
►
June
(3)
►
May
(1)
►
April
(1)
►
January
(1)
About Me
NN
Love Music. Fan of Ilayaraja. Like Federer and VVS Lakshman. Love to write.
View my complete profile