Thursday, November 11, 2010

సర్వభాషా మాధురి మన ఆంధ్రం

సర్వభాషా జనని మన సంస్కృతం
సర్వభాషా మాధురి మన ఆంధ్రం
నాభి నడుమ జనియించు ఆంధ్రాక్షరం
అధరాంచు ధ్వనియించు ఆంగ్లాక్షరం

భాష మెడలో వరమాల తెలుగు వర్ణమాల
భాష సిగలో మల్లెమాల తెలుగు కావ్యమాల
భాషలందు తెలుగు లెస్స అయిన శుభవేళ
భరతవనాన భాతృగణ గళాన ఆంగ్లమేల?