నేనుండగ నా ప్రియుల సన్నిధి
న్యాయము చేయగ పరులకి కాఖీలు చూపిరి నాకు నరకపు వాకిలి
ఆహా ఎంత శుభ దినమది!?
నా తనయకిది ఇరువది జన్మతిధి
తన పెండ్లిపందిరి వేయగ తలంచితి
ఏమి చేయగల?, నేనున్నది జైలుగది
ఆహా ఎంత శుభ దినమది!?
వరకట్నపు కాటుకు నా తనయ బలి ఆయెనను కబురుతో నిదుర లేచితి
రేపవలు శ్రమించి నా తనయను కాపాడ మనసార తలంచితి
ఏమి చేయగల?, నేనున్నది జైలుగది
ఆహా ఎంత శుభ దినమది!?
నా భార్యను మింగెను కరకు ఆకలి
తన గుప్పిలి నిండుగా కూడివ్వ తలంచితి
ఏమి చేయగల?, నేనున్నది జైలుగది
ఆహా ఎంత శుభ దినమది!?
నివు నిర్దోషివని నను పొమ్మని నిదుర లేపిరి
విడిపించబడితి గాని గమ్యమెరుగనైతి
విడిపించబడితి గాని ఎందుకు బ్రతకాలో యెరుగనైతి
విడిపించబడితి గాని యిన్నేండ్లు ఏల పట్టబడితినో ఎరుగనైతి
న్యాయానికి అర్ధం తెలియక అక్కడె నిలుచుంటి
నాకు దాని అర్ధము ఎవరు చెప్పగలరూ?
బహుశా నిఘంటువున దానిని సైతాను చొప్పించెనా?
లేక అసత్యసత్యమును దాయగ వారు దాని వాడిరా?
ఆహా ఎంత శుభ దినమది!?
న్యాయపు కౌగిలి గాలిగుప్పిలి
న్యాయం తోడుగా నేనొంటరి
నేడు కొడిగట్టిన జ్యోతుల దీపావళి!
చాలా బాధగా ఉంది చదువుతుంటే .
ReplyDeleteIt actually was my telugu translation to the poem written in English by one of my dear frineds Madam. Thank you for the complement. I have seen your blog as well. Those are very nice and worthy writings by you.
Delete