ఆ చలి రాతిరిలో ఓ అరమనిషి
వణికే చలిలో తనకి చీకటే దుప్పటి
డొక్కలో కాళ్ళు పక్కనే కుక్కలు
అక్కరకు రాలేదు తను కన్నవారు
ఆ టీకొట్టు పక్కన
ఈగలు ముసిరినా తోలలేని వయసు
ఈ పెద్దమ్మగుడి ముందర
తల్లెవరో తెలియని పసికందు
స్నాన సంస్కారం లేక ఉప్పుచారాలు తేరిన దేహం
చిరిగిన బట్టలు దుమ్మురాల్చే జుట్టు
యిన్ని చూసినా నాకు కన్నీరే రాదాయే
నా మనసుకు డబ్బు తెర అడ్డుపడిందా?
నా సంస్కారానికి చీకటి కమ్మిందా?
ఓ మరమనిషీ నువ్వు మనిషివేనని గుర్తుచేయ్యలా?
వణికే చలిలో తనకి చీకటే దుప్పటి
డొక్కలో కాళ్ళు పక్కనే కుక్కలు
అక్కరకు రాలేదు తను కన్నవారు
ఆ టీకొట్టు పక్కన
ఓ బక్కచిక్కిన ముసలమ్మ
చేతిలో చిల్లర గలాసు ఈగలు ముసిరినా తోలలేని వయసు
ఈ పెద్దమ్మగుడి ముందర
తల్లెవరో తెలియని పసికందు
స్నాన సంస్కారం లేక ఉప్పుచారాలు తేరిన దేహం
చిరిగిన బట్టలు దుమ్మురాల్చే జుట్టు
యిన్ని చూసినా నాకు కన్నీరే రాదాయే
నా మనసుకు డబ్బు తెర అడ్డుపడిందా?
నా సంస్కారానికి చీకటి కమ్మిందా?
ఓ మరమనిషీ నువ్వు మనిషివేనని గుర్తుచేయ్యలా?
బాగున్నాయి కవితలు ఖచ్చిత మైన వాస్తవాలను కళ్ళకు కట్టి చూపించారు
ReplyDeleteThank you Madam
ReplyDelete