Saturday, March 5, 2011

ఓ మరమనిషీ

ఆ చలి రాతిరిలో ఓ అరమనిషి
వణికే చలిలో తనకి చీకటే దుప్పటి
డొక్కలో కాళ్ళు పక్కనే కుక్కలు
అక్కరకు రాలేదు తను కన్నవారు

ఆ టీకొట్టు పక్కన
ఓ బక్కచిక్కిన ముసలమ్మ 
చేతిలో చిల్లర గలాసు
ఈగలు ముసిరినా తోలలేని వయసు

ఈ పెద్దమ్మగుడి ముందర
తల్లెవరో తెలియని పసికందు
స్నాన సంస్కారం లేక ఉప్పుచారాలు తేరిన దేహం
చిరిగిన  బట్టలు దుమ్మురాల్చే జుట్టు

యిన్ని చూసినా నాకు కన్నీరే రాదాయే
నా మనసుకు డబ్బు తెర అడ్డుపడిందా?
నా సంస్కారానికి చీకటి కమ్మిందా?
ఓ మరమనిషీ నువ్వు మనిషివేనని గుర్తుచేయ్యలా?

2 comments:

  1. బాగున్నాయి కవితలు ఖచ్చిత మైన వాస్తవాలను కళ్ళకు కట్టి చూపించారు

    ReplyDelete